అదిరిపోయిన రాజేంద్రప్రసాద్ గెటప్......
తెలుగు సినిమా చరిత్రలోనే రాజేంద్రప్రసాద్ గారిది ఓ చెరగని ముద్ర...
పాత సినిమాల లో కామెడీ అనేది ఓ బాగంగా సినిమా మద్యలో అక్కడక్కడ
వచ్చేది.. ఆనాడు మహానటులు అల్లు రామలింగయ్య, రేలంగి, పద్మనాభం లాంటి
మహానటులు హాస్యాన్ని పండించేవారు. కాని అది సినిమా లో కొంత వరకు మాత్రమే
ఉండేది. కాని రాజేంద్రప్రసాద్ గారి రాకతో ఆ పద్దతి మారి పోయి కామెడీనే కథగా,
కమెడియన్ నే హీరోగా అనే ఓ సరికొత్త చరిత్ర మొదలైంది.
స్నేహం అనే ఓ సినిమా ద్వార తెలుగు సినిమాకు ఓ మంచి స్నేహితుడు (నటుడు)
దొరికాడు.. మొదట చిన్న చిన్న వేషాలతో మొదలైన తన నట జీవితం హీరోగా
కామెడీ తోనే ఫిలిం ఫేర్ అవార్డు దాక సాగింది..
కానీ మనం ఇక్కడ ఒక విషయం గుర్తించాలి ఆరోజుల్లో రాజేంద్రప్రసాద్ అనే వాడు కేవలం
కామెడీ నే చేస్తాడు అనుకునే వాళ్ళ అంచనాలని తలకిందులు చేస్తూ 1990 లో ఒక
సీరియస్ పాత్రలో విభిన్నంగా నటించి నంది అవార్డు తీసుకొన్నారు...
అక్కడినుంచి కామెడీ తో పాటు మద్యలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సీరియస్ పాత్రలు వేస్తూ
రాజేంద్రప్రసాద్ అంటే నవరసాల సమ్మేళనంగా నిలిచారు...
మళ్లీ ఇప్పుడు ఓ సరికొత్త రూపంతో ఓ స్వామిజి రూపంలో మన ముందుకు వస్తున్నారు...
ఇది ఆ రాజేంద్రుని అభిమానులకు ఓ చక్కని విందు భోజనంఉన్నట్లే....
తొందరలో మన ముందుకు రానున్న ఈ చిత్రంలో ఆయన చేసే మాయలేంటో చూద్దాం..