తెలుగు సినిమా అంటే కొంచం కామెడీ మూడు ఫైట్లు ,నాలుగు పాటలు ఉంటె చాలు అనుకునే వారికీ ఈ
సినిమాలోని మెస్సేజ్ అర్తం కాకుంటే అది ఫ్లాప్ సినిమా కింద లెక్కే....
పవన్ అనుకుంటే అలాగే మూస పద్దతి లో సినిమాలు తీయొచ్చు..... కానీ ఈరోజు సమాజంలో ఉన్న
ఓ చిన్న సమస్యను తీసుకొని తన ఇమేజ్ ని కూడా పక్కన పెట్టి ఇలాంటి మెస్సేజ్ ఓరిఎంతెడ్ మూవీ
తీసారంటే మనం దానిలోని లోపాలు వెతకడం కంటే అందులోని మెస్సేజ్ ని గుర్తించడానికి ప్రయన్తించక
పొవడం పైగా ఇదేం సినిమా రొమాన్స్ లేదు కామెడీ లేదు అంటూ అవసరం లేని వాటిగురించి ప్రచారం చేయడం కొంచం బాధాకరం..
పూర్తిగా కామెడీ కావాలంటే చాలా కామెడీ ఒరిన్టేడ్ సినిమా లు వస్తున్నాయి.. అలాగే బూతు సినిమాలు
ఈ మద్య చాలా వస్తున్నాయి బూతు కామెడీ నే కావాలంటే వాటికి వెళ్తే సరిపోతుంది కానీ
ఈ మద్య చాలా వస్తున్నాయి బూతు కామెడీ నే కావాలంటే వాటికి వెళ్తే సరిపోతుంది కానీ
ఇలా ఒక సోషల్ అవేర్నేస్స్ మూవీ కి వాటికి లింక్ పెట్టడం న్యాయం కాదేమో అని నా అభిప్రాయం...
కానీ చాలా రోజుల తర్వాత పవన్ లో ఇలాంటి ఫైర్ చూసాం అనిపించింది ఈ మూవీ చూసి...
ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు తన లో ఒక నిజాయితీ కనిపించింది... ఆ యునిఫాం పవన్ కి యాప్ట్
అనిపించింది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు తక్కువగా ఉన్న పవన్ ప్రయత్నం మాత్రం
చెప్పుకో తగ్గదే..
ఈ రోజు చాలా మన రాష్ట్రంలో చాలా పోలీసు స్టేషన్ లు ఇలానే ఉన్నాయ్ చాలా సినిమాల్లో కూడా చూపించారు కానీ దాన్ని మార్చడానికి మార్గం చూపడం లేదు... ఇందులో పవన్ చూపించన విధానం
ఆచరణ కి వీలవుతుందో లేదో తెలిదు కానీ నిజంగా ఇలా కూడా చేయొచ్చేమో అనిపించింది..
పవన్ కళ్యాణ్ గారి ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు జాబితాలో ఉంటుందో లేదో కానీ మంచి
చిత్రాల జాబితా లో నిలిచిపోతుంది... ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ( కామెంట్) చెప్పండి..